యూపీఐ ఆధారిత చెల్లింపుదారులకు పేటీఎం గుడ్ న్యూస్ చెప్పింది. డిజిటల్ చెల్లింపులపై నమ్మకం పెంచడం సహా వినియోగదారులు నష్టపోకుండా ఉండేందుకు ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులోకి తెచ్చింది. పేటీఎం, హెచ్ డీఎఫ్ సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ భాగస్వామ్యంతో గ్రూప్ ఇన్సూరెన్స్ ప్లాన్ ప్రారంభించింది. దీని ప్రకారం మోసపూరిత లావాదేవీలు జరిగినప్పుడు వినియోగదారునికి రూ.10 వేల బీమా సొమ్ము వచ్చేలా కొత్త పాలసీ తీసుకొచ్చింది. ఇందుకోసం వినియోగదారుడు ఏడాదికి రూ.30 చెల్లించాల్సి ఉంటుంది. త్వరలోనే ఇదే ప్లాన్ కింద ఏడాదికి రూ.లక్ష కవరేజీని ఆఫర్ చేయనున్నట్లు పేటీఎం వెల్లడించింది.