సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్ ప్రభుత్వ సంబంధిత ఖాతాలకు గ్రే టిక్ వెరిఫికేషన్ మార్క్‌ను, కంపెనీలకు గోల్డెన్ టిక్ మార్క్ ను విడుదల చేయడం ప్రారంభించింది. కంపెనీలకు గోల్డ్ వెరిఫికేషన్ బ్యాడ్జ్‌లను ఇచ్చిన తర్వాత ప్రభుత్వ ఖాతాలకు గ్రే టిక్ మార్కులను ట్విట్టర్ విడుదల చేసింది. మిగిలిన వెరిఫై చేయబడిన ఖాతాలకు బ్లూ టిక్ మార్క్ ను ఇస్తోంది. తాజాగా భారత ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ ఖాతాలకు బ్లూ టిక్ మార్క్‌ను గ్రే టిక్‌తో భర్తీ చేసింది. ట్విట్టర్ బ్లూ టిక్ కోసం నెలకు 8 డాలర్లు (దాదాపు రూ. 600), ఐఓఎస్ లో సైన్ అప్ చేసే వారికి నెలకు 11 డాలర్లు (దాదాపు రూ. 1,000) వసూలు చేయడం ప్రారంభించింది. దీనిని క్రమంగా ప్రపంచమంతటా విస్తరించాలని యోచిస్తోంది.
ట్విట్టర్ లో ఇప్పటికే ఉన్న బ్లూ సబ్‌స్క్రైబర్‌లు కొత్త ధరతో తమ సబ్‌స్క్రిప్షన్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు లేదా రద్దు చేసుకోవచ్చు లేదా ఆటోమేటిక్‌గా రెన్యూవల్ చేసుకోవచ్చు. ప్రాంతాల వారీగా దీని ధరలు మారే అవకాశం ఉంది. ట్విట్టర్ బ్లూ సర్వీస్ ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యునైటెడ్ కింగ్‌డమ్‌లలో అందుబాటులో ఉంది.