వాట్సాప్ భారత యూజర్లకు మరోసారి షాక్ ఇచ్చింది. నవంబర్‌లో ఏకంగా 37.16 లక్షల ఖాతాలను నిషేధించింది. ఇది గతంతో నిషేధించబడిన ఖాతాల కంటే దాదాపు 60 శాతం ఎక్కువ. యూజర్ల నుంచి ఎలాంటి రిపోర్ట్ రాకముందే యాక్టివ్‌గా ఉన్న 9.9 లక్షల ఖాతాలను బ్యాన్ చేసినట్టు వాట్సాప్ తెలిపింది. కాగా, అక్టోబర్ నెలలో దేశంలో 23.24 లక్షల వాట్సాప్ ఖాతాలను నిషేధించగా.. వాటిలో చురుకుగా ఉంటే.. 8.11 లక్షల ఖాతాలు నిషేధించబడ్డాయి. ఐటీ నిబంధనలు 2021, 4(1)(డి) నిబంధనలకు అనుగుణంగా ఈ ఖాతాలను నిషేధించినట్టు మెటా యాజమాన్యంలోని వాట్సాప్ వెల్లడించింది.