సామాజిక మాధ్యమాల వేదికగా లక్షల మంది ఫాలోవర్లను కలిగి, ప్రముఖులుగా చలామణి అయ్యే వారిని కట్టడి చేస్తూ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. వీరు డబ్బులు తీసుకుని వివిధ సంస్థలు, ఉత్పత్తులకు అనుకూల కథనాలను ప్రసారం చేస్తుంటారు. ఇకపై వీరు తాము చేసేది పెయిడ్ ప్రమోషన్ అని ముందే చెప్పి తీరాలి. లేదంటే రూ.50 లక్షల జరిమానా చెల్లించాల్సి వస్తుంది. ఇటువంటి వారిపై సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీకి ఫిర్యాదు చేయవచ్చు. ఈ నెల 24 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఈ నూతన నిబంధనలు కేవలం సోషల్ మీడియా చానళ్లకే కాకుండా, ఇతర సెలబ్రిటీలు, ఆర్థిక సలహాదారులు అందరికీ వర్తిస్తాయి.