రాష్ట్రంలో ఎంసెట్- 2023 పరీక్షల నిర్వహణకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి షెడ్యూలును ప్రకటించింది. ఎంసెట్- 2023 పరీక్షలను మే నెల 7వ తేదీ నుంచి ప్రారంభించి 11వ తేదీ వరకూ నిర్వహించనున్నట్లుగా తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొ. లింబాద్రి శుక్రవారం జెఎన్‌టియు క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరించారు. మేనెల 7, 8, 9 తేదీల్లో ఎంసెట్‌లోని ఇంజినీరింగ్ కోర్సులకు సంబంధించిన ఎంట్రన్స్ పరీక్షలు జరుగుతాయని వివరించారు. అదే వి ధంగా మేనెల 10, 11 తేదీల్లో ఎంసెట్‌లోని అగ్రికల్చర్, మెడిసిన్ కోర్సుల్లో అడ్మిషన్లకు ఎంట్రన్స్ పరీక్షలు జరుగుతాయని ప్రొఫెసర్ లింబాద్రి వివరించారు. అయితే ఈ ఎంట్రన్స్ పరీక్షలన్నీ కం ప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సిబిటి) విధానంలో నిర్వహిస్తున్నామని చెప్పారు.