మహిళల ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) వరుసగా రెండో మ్యాచ్‌లో ఓడిపోయింది. టీమ్ ఇండియా స్టార్ స్మృతి మంధాన కెప్టెన్సీలో ఆడుతున్న ఈ జట్టులో చాలా మంది స్టార్ ప్లేయర్లు ఉన్నారు. టోర్నీ ప్రారంభానికి ముందు ఈ జట్టు ట్రోఫీని గెలుచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. కానీ మ్యాచ్‌లు ప్రారంభమయ్యాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మంధానతో పాటు ఎలిస్ పెర్రీ, రిచా ఘోష్, హీథర్ నైట్ వంటి భారీ హిట్టర్లు ఉన్నప్పటికీ, ఈ జట్టు పెద్ద స్కోరు చేయడంలో విఫలమవుతోంది. తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఆర్‌సీబీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. రెండో మ్యాచ్‌లోనూ ముంబై చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీనిపై స్మృతి మాట్లాడుతూ.. 'ఈ వికెట్‌పై మరింత మెరుగైన స్కోరు చేసి ఉండాల్సింది. మేం అంత గొప్ప స్కోరు చేయలేదు. తర్వాతి మ్యాచ్‌ల్లో కచ్చితంగా రాణిస్తాం. ఈ మ్యాచ్‌లో ఇద్దరు లేదా ముగ్గురు బ్యాట్స్‌మెన్‌కు మంచి ఆరంభాలు లభించాయి. కానీ వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యారు అని తెలిపింది.