జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ వినూత్న జాబ్ ఆఫర్ ప్రకటించాడు. చీఫ్ ఆఫ్ స్టాఫ్ నియామకానికి దరఖాస్తులకు గోయల్ ఆహ్వానం పలికాడు. అయితే కంపెనీకి రూ. 20 లక్షలు ఫీజుగా చెల్లించాలని కండీషన్ పెట్టాడు.
తొలి ఏడాది వేతనం ఉండదంటూ ప్రకటనలో పేర్కోన్నాడు. రెండో ఏడాది నుంచి రూ. 50 లక్షల వేతనం ఇస్తానని తెలిపాడు. నేర్చుకోవాలనుకునే వారికి ఇదో మంచిఅవకాశం అంటూ వెల్లడించాడు.