భారత్‌తో టెస్టు సిరీస్‌ను కోల్పోయిన ఆస్ట్రేలియాకు మరో చేదు వార్త అందింది. ఆస్ట్రేలియా రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండడని తెలుస్తోంది. ఢిల్లీలో జరిగిన రెండో టెస్టు తర్వాత స్వదేశానికి వచ్చిన పాట్ కమిన్స్ ఇప్పుడు భారత్‌తో వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. వన్డే సిరీస్ కోసం అతడు భారత్‌కు తిరిగి రావడం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. పాట్ కమిన్స్ తన తల్లి ఆరోగ్యం క్షీణించడంతో ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లాడు. ఆ తర్వాత తన తల్లి మరణంతో మరలా భారత్‌కు తిరిగి రాలేదు. ఇప్పుడు వన్డే సిరీస్ నుంచి కూడా వైదొలిగినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. పాట్ కమిన్స్ గైర్హాజరీలో మరోసారి స్టీవ్ స్మిత్ ఆస్ట్రేలియాకు వన్డే సిరీస్‌లో సారథ్యం వహించనున్నాడు. స్మిత్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా ఇండోర్ టెస్టులో విజయం సాధించింది. ఆ తర్వాత WTC ఫైనల్‌కు టిక్కెట్‌ను పొందింది. ఇప్పుడు స్మిత్ ముందు వన్డే సిరీస్ గెలవాల్సిన బాధ్యత నెలకొంది.