వెస్టిండీస్‌తో జరుగుతున్న డొమినికా టెస్టులో టీమిండియా ఆధిక్యంలో కొనసాగుతోంది. తొలి రోజు రెండున్నర సెషన్లలోనే వెస్టిండీస్‌ను భారత బౌలర్లు ఆలౌట్ చేసారు. రెండో రోజు భారత బ్యాట్స్‌మెన్ రెచ్చిపోయారు. రెండో రోజు పూర్తిగా 90 ఓవర్లు బ్యాటింగ్ చేసి 2 వికెట్లు మాత్రమే కోల్పోయింది.
అరంగేట్రం ఆటగాడు యశస్వి జైస్వాల్, కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీలతో రాణించడంతో భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 113 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 350 బంతుల్లో 14 ఫోర్లతో 143 పరుగులతో క్రీజులో ఉండగా, విరాట్ కోహ్లీ 96 బంతుల్లో ఒక బౌండరీతో 36 పరుగులతో క్రీజులో ఉన్నారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 72 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని జోడించారు.