ఆసియాకప్‌లో మరో కీలక మ్యాచ్‌కి భారత జట్టు సిద్ధమైంది. పాకిస్థాన్ పై విజయం మత్తెక్కించకముందే.. శ్రీలంకతో ఆడేందుకు టీమిండియా సిద్ధమైంది. ఈ మ్యాచ్ కూడా కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా బ్యాటింగ్ చేస్తామని తెలిపాడు. తమ జట్టులో ఒకే ఒక్క మార్పు చేశామని వెల్లడించాడు. వరుసగా మూడో రోజు టెస్టు ఆడుతున్న ఫీలింగ్ ఉందని, అయితే ఇలాంటి ఛాలెంజ్‌లను స్వీకరించి అడ్జస్ట్ అవడం చాలా కీలకమని రోహిత్ అన్నాడు. పిచ్ చూస్తుంటే పాకిస్తాన్ మ్యాచ్‌కు చాలా భిన్నంగా కనిపిస్తోందని, ఈ పిచ్ నుంచి స్పిన్నర్లకు ఎక్కువ సహకారం అందే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నానని రోహిత్ వివరించాడు. ఈ క్రమంలోనే తమ జట్టులో శార్దూల్ ఠాకూర్‌ను పక్కన పెట్టి, అక్షర్ పటేల్‌ను తీసుకున్నామని ప్రకటించాడు.