సాధారణంగా జలుబు చేసినప్పుడు గొంతు నొప్పి, గొంతులో మంట, బొంగురు పోవడం ఇలాంటివి అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. ఈ గొంతు నొప్పి ఎన్ని రోజులు అయినా తగ్గకపోతే నిర్లక్ష్యం చేయొద్దు అంటూ డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే గొంతు కేన్సర్ లోనూ ఇలాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. గొంతులో శ్వాస తీసుకోవడంలో సమస్యలు, పొడి దగ్గు, గొంతులో ఏదో అడ్డు ఉందని (ఫారీన్ బాడీ) అనిపించడం, మింగడం కష్టమనిపించడం, గొంతులో కణితి, వాయిస్ మారిపోవడం కనిపిస్తుంటే ఒక్కసారి తప్పకుండా వైద్యులను సంప్రదించి నిర్ధారణ చేసుకోవాలి. వీలైనంత వెంటనే ఈఎన్ టీ వైద్య నిపుణులను సంప్రదించడం ద్వారా అనుమానాలను నివృత్తి చేసుకోవాలని డాక్టర్స్ చెప్పుతున్నారు.