పోలెండ్ తార ఇగా స్వైటెక్ డబ్ల్యూటీఏ ఫైనల్ టోర్నీలో విజేతగా నిలిచింది. ఏకపక్షంగా సాగిన ఫైనల్లో ఆమె 6-1, 6-0తో జెస్సికా పెగులా (అమెరికా)ను చిత్తు చేసింది. దూకుడుగా ఆడిన స్వైటెక్.. రెండు సెట్లలో కేవలం ఒక్క గేమ్ మాత్రమే కోల్పోయి ఘన విజయాన్ని అందుకుంది. రెండు నెలల క్రితం టాప్ ర్యాంకును చేజార్చుకున్న స్వైటెక్.. తాజా విజయంతో ఈ సీజన్‌ను నంబర్‌వన్‌గా ముగించబోతోంది.