మహమ్మద్ షమీ అద్బుతంగా బౌలింగ్ చేశాడని, అతడి వల్లనే ఈ విజయం సాధించామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. న్యూజిలాండ్ బ్యాటర్లు డారిల్ మిచెల్, కేన్ విలియమ్సన్ అద్భుతంగా ఆడారని, ఓ దశలో తమని బయపెట్టారని పేర్కొన్నాడు. మ్యాచ్ అనంతరం ప్రెస్ మీట్ లో రోహిత్ మాట్లాడుతూ. లీగ్ దశలో 9 మ్యాచ్‌లు ఎలా ఆడామో, అలానే నాకౌట్ మ్యాచ్‌ల్లో సత్తాచాటాలని ముందే నిర్ణయించుకున్నామని చెప్పాడు. నిన్న న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ లో మ్యాచ్ లో భారత్ గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లింది.
వన్డే ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ మరో అరుదైన ఘనత సాధించాడు. వరల్డ్ కప్‌లో అత్యంత వేగంగా 50 వికెట్లు పడగొట్టిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. వాంఖడే వేదికగా జరిగిన సెమీ ఫైనల్‌లో కేన్ విలియమ్సన్ వికెట్ తీయడం ద్వారా షమీ ఈ ఘనత సాధించాడు.