ప్రపంచకప్ 2023లో భాగంగా నేడు మరో బిగ్ ఫైట్ జరుగనుంది. కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా రెండో సెమీ ఫైనల్‌లో సౌతాఫ్రికా-ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక నాలుగుసార్లు సెమీస్ చేరినా ఫైనల్లో అడుగుపెట్టని సఫారీలు ఐదోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇక బలాబలాల్లో ఇరుజట్లూ సమవుజ్జీలే అయినా. ఒత్తిడిని జయించడంలో ఆస్ట్రేలియా కాస్త ముందంజలో ఉంది.
భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో చరిత్ర మార్చాలని దక్షిణాఫ్రికా పట్టుదలతో ఉంది. వన్డే ప్రపంచకప్‌లో నాలుగుసార్లు సెమీస్‌కు చేరినా.. ఫైనల్‌కు చేరని సఫారీలు ఐదోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే భారత్ ఆఖరి మ్యాచ్‌లో ఇరు జట్లకు సమాన అవకాశాలు ఉన్నాయి. అయితే లీగ్ మ్యాచ్‌లో తొలుత ఆస్ట్రేలియాపై ఘనవిజయం సాధించిన దక్షిణాఫ్రికా.. మరోసారి అదే ప్రదర్శన కనబరిస్తే ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. డికాక్ మరోసారి బ్యాట్‌తో చెలరేగితే ప్రొటీస్‌కు తిరుగుండదు. అయితే ప్రపంచకప్‌లో ఎన్నడూ నాకౌట్‌ను దాటని దక్షిణాఫ్రికా గత చరిత్ర కలవరపెడుతోంది. మరోవైపు ఐదుసార్లు ప్రపంచకప్ గెలిచిన ఆస్ట్రేలియాకు గత చరిత్రే ఆయుధంగా మారనుంది. రెండు జట్లు సమంగా ఉన్నప్పటికీ ఒత్తిడిని అధిగమించడంపైనే మ్యాచ్ ఆధారపడి ఉంది. అయితే ఈ కీలక ఆటగాళ్లు రాణిస్తే.. ఇరు జట్లకు విజయావకాశాలు మెరుగవుతాయి...