ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య 2023 ప్రపంచకప్ తొలి సెమీఫైనల్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. మైదానంలో యాక్షన్ మొదలు కాకముందే బయట కూడా సందడి మొదలైంది. మ్యాచ్‌కు ముందు వాంఖడే పిచ్‌ని మార్చడమే గందరగోళానికి అసలు కారణం. ఈ మ్యాచ్‌కు ముందుగా నిర్ణయించిన కొత్త పిచ్‌కు బదులు.. రెండు మ్యాచ్‌ల్లో ఉపయోగించిన పిచ్‌నే ఉపయోగించనున్నట్లు ఓ ఆంగ్ల పత్రిక వెల్లడించింది. అప్పటి నుంచి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుపైనా, ఐసీసీపైనా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు ఈ విషయంలో ఐసీసీ క్లారిటీ ఇచ్చింది.
వన్డే ప్రపంచకప్-2023 తొలి సెమీస్‌లో చివరి నిమిషంలో బీసీసీఐ పిచ్‌ని మార్చిందన్న ఆరోపణలపై ఐసీసీ వివరణ ఇచ్చింది. భారత్-కివీస్ మ్యాచ్ అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేన్ విలియమ్సన్ 'పిచ్ వివాదం'పై స్పందించాడు. "పిచ్‌తో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ పిచ్‌ను మ్యాచ్‌లకు ఉపయోగిస్తారు. ఇది రెండు జట్లకు అనుకూలంగా పనిచేసింది అని కేన్ అన్నాడు.