ప్రపంచకప్‌ను భారత్ గెలుస్తుందని మెజారిటీ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటి వరకు టీమ్ ఇండియా చూపిన ఆధిపత్యానికి అదే కారణం. సెమీఫైనల్ మినహా దాదాపు అన్ని మ్యాచ్‌ల్లోనూ భారత్ ఏకపక్షంగా విజయం సాధించింది. అయితే పాక్ క్రికెటర్ మాలిక్ మాత్రం మరోలా మాట్లాడుతున్నాడు. ప్రపంచకప్ గెలవడానికి ఆస్ట్రేలియాకు అన్ని అర్హతలు ఉన్నాయని, ఆసీస్ భారత్‌ను ఓడించి మళ్లీ ఛాంపియన్‌గా నిలుస్తుందని నమ్ముతున్నాను' అని చెప్పాడు.