ఆదివారం భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనున్న ప్రపంచకప్ ఫైనల్ మరింత ప్రత్యేకం కానుంది. ఈ పోరును వీక్షించేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్‌లు స్టేడియానికి రానున్నారు. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు భారత వైమానిక దళం ఆధ్వర్యంలోని సూర్య కిరణ్ ఏరోబాటిక్ టీమ్ విన్యాసాలు చేయనుంది. ఈ స్టేడియంలో కనీసం 1 లక్షా 30 వేల మంది అభిమానులు మ్యాచ్‌ని వీక్షించే అవకాశం ఉంది. ఈ భారీ పోరులో భద్రత బలగాలు ఎక్కువగా మోహరించనున్నారు.
2023 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో భారత్ ఢీకొననున్న నేపథ్యంలో మాజీ క్రికెటర్ గవాస్కర్ టీమిండియాకు వార్నింగ్ ఇచ్చాడు. ఆదివారం ప్రపంచకప్ ఫైనల్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఫేవరెట్ అని సన్నీ స్పష్టం చేశాడు. అదే సమయంలో ఆస్ట్రేలియాను తేలికగా తీసుకోవద్దని చెప్పాడు. అయితే ఆస్ట్రేలియన్లను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి. మ్యాక్స్‌వెల్ ఎలా ఆడారో చూశానని గవాస్కర్ పేర్కొన్నాడు.
2003 ప్రపంచకప్‌లో ఫైనల్‌లో తలపడిన భారత్, ఆస్ట్రేలియా జట్లు 20 ఏళ్ల తర్వాత మళ్లీ ట్రోఫీ కోసం తలపడనున్నాయి. అప్పుడూ ఇప్పుడూ లాగానే లీగ్ స్టేజ్, సెమీ ఫైనల్స్‌లో భారత్ ప్రత్యర్థులపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఆ తర్వాత లీగ్ దశలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఓడి.. ఈసారి ఓటమి ఎరుగని జట్టుగా సెమీస్‌లోకి ప్రవేశించి.. అక్కడ న్యూజిలాండ్‌ను ఓడించింది.