మూడోసారి వన్డే ప్రపంచ చాంపియన్గా అవతరించేందుకు భారత జట్టు మరో అడుగు దూరంలో నిలిచింది. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్, 2011 ప్రపంచకప్ ఛాంపియన్స్ జట్టు సభ్యుడు వీరేంద్ర సెహ్వాగ్ భారత జట్టుకు కొన్ని సలహాలు ఇచ్చాడు. ఫైనల్ మ్యాచ్ రోజు మైదానంలోకి అడుగు పెట్టినప్పుడు ‘ఈరోజు నాది.. ఈరోజు నేను నా భారత జట్టు కోసం మంచి క్రికెట్ ఆడతాను’ అని ఆలోచించాలని సెహ్వాగ్ అన్నాడు.