టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కోసమైనా వన్డే ప్రపంచకప్ టైటిల్ సాధిస్తామని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. భారత్ విజయాల వెనుక ద్రావిడ్ అసాధారణ పాత్ర ఉందని తెలిపాడు. జట్టులోని ఆటగాళ్లకు స్పష్టమైన రోల్స్ అందించారని కొనియాడాడు. కనీసం అతని కోసమైనా టైటిల్ గెలిచి తీరుతామని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. ‘కఠిన సమయాల్లోనూ ఆటగాళ్లకు అండగా నిలిచాడు. మేం అతని కోసం విజయం సాధించాలనుకుంటున్నాం' అని చెప్పుకొచ్చాడు.
వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్‌కు భారత్ -ఆస్ట్రేలియా జట్లు యుద్ధ పోరుకి సిద్ధంగా ఉన్నాయి. 45 రోజుల్లో 48 మ్యాచ్‌లు ఆడి.. చాంపియన్‌ను నిర్ణయించే తుది పోరుకు సమయం ఆసన్నమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్త్, ఆస్టఆస్ట్రేలియా మధ్య ప్రపంచకప్ 2023 ఫైనల్ ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది. సొంతగడ్డపై అభిమానుల మద్దతుతో మూడో టైటిల్ పై భారత్ దృష్టి సారిస్తోంది.