వన్డే వరల్డ్కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయింది. భారత జట్టు మరోసారి చరిత్ర తిరగరాస్తుందనుకుంటే ఇలా జరిగిందేంటని క్రికెట్ అభిమానులు కలత చెందారు. అయితే రోహిత్ సేనకు యావత్ దేశం మద్దతుగా నిలిచింది. ఈ తరుణంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఒక వీడియో విడుదల చేశారు. తమకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.