భారత జట్టుకు కొత్త ప్రధాన కోచ్ రావడం దాదాపు ఖాయం. రాహుల్ ద్రవిడ్ రెండేళ్ల కాంట్రాక్ట్ వన్డే ప్రపంచకప్ 2023తో ముగుస్తుంది. ఆ పదవిలో కొనసాగకూడదని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని బీసీసీఐకి కూడా తెలియజేశాడు. ద్రవిడ్ స్థానంలో హైదరాబాద్ సొగసరి వీవీఎస్ లక్ష్మణ్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడుతున్న భారత జట్టుకు లక్ష్మణే ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్‌సీఏ అధినేతగా ఉన్న వీవీఎస్ గతంలో తాత్కాలిక కోచ్‌గా వ్యవహరించారు.
భారత జట్టు ప్రధాన కోచ్‌గా పని చేసేందుకు వీవీఎస్ లక్ష్మణ్ ఆసక్తి చూపుతున్నాడు. దీనికి సంబంధించి, అతను ప్రపంచ కప్ 2023 సందర్భంగా అహ్మదాబాద్ వెళ్లి బీసీసీఐ అధికారులను కలిశాడు. కోచ్‌గా లక్ష్మణ్ దీర్ఘకాలిక ఒప్పందంపై సంతకం చేయనున్నారు. డిసెంబరు నెలలో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే భారత జట్టుకు అతను బాధ్యతలు చేపట్టనున్నాడు. పూర్తి స్థాయి కోచ్‌గా లక్ష్మణ్‌కి ఇది తొలి పర్యటన' అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. నవంబర్ 2021లో టీమిండియా ప్రధాన కోచ్‌గా నియమితులైన రాహుల్ ద్రవిడ్ వన్డే ప్రపంచకప్ ఫైనల్‌తో తన పదవీకాలం ముగిసింది.