ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టులోకి హార్దిక్ పాండ్య తిరిగి రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ జట్టుకు హార్దిక్ నేతృత్వం వహిస్తున్నాడు. అతడిని రూ.15 కోట్లకు ఆల్ క్యాష్ డీల్ కింద గుజరాత్ టైటాన్స్‌కు ముంబై ఇండియన్స్ చెల్లించనున్నట్లు ESPNcricinfo వెల్లడించింది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. డిసెంబర్ 19న ఆటగాళ్ల వేలం జరగనుంది. అయితే ప్లేయర్స్ రిటెన్షన్ ఆదివారంతో ముగియనుంది.
ఇప్పుడు ఐపీఎల్ 17వ ఎడిషన్ బదిలీల్లో హార్దిక్ పాండ్యా తీవ్ర చర్చనీయాంశమైంది. ఐపీఎల్ 17వ ఎడిషన్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడేందుకు హార్దిక్ పాండ్యా అంగీకరించినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నీతా అంబానీని ముంబై మేనేజ్మెంట్ ట్రేడ్ రూపంలో తమ టీమ్‌లోకి తీసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. పాండ్యాను జట్టులోకి తీసుకుని, జోఫ్రా ఆర్చర్‌ను ట్రేడ్ రూపంలో ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ డీల్ ఓకే అయిందని ఊహాగానాలు మొదలయ్యాయి. ఒప్పందం కుదిరితే, ఐపీఎల్ 2024 ప్రారంభమయ్యే సమయానికి పాండ్యా ముంబై ఇండియన్స్‌లో చేరతాడు. అయితే దీనిపై గుజరాత్ టైటాన్స్ కానీ, ముంబై ఇండియన్స్ కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆటగాళ్లను భర్తీ చేసేందుకు ఫ్రాంచైజీలకు ఆదివారం వరకు గడువు ఉంది. దీనిపై అప్పటి వరకు క్లారిటీ వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. పాండ్యా ఏడేళ్ల పాటు ముంబై ఇండియన్స్‌కు ఆడాడు.