ఉత్తరప్రదేశ్ క్రికెట్ బోర్డుపై భారత స్టార్ పేసర్ మహమద్ షమీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బోర్డులో ఉన్న రాజకీయాల వల్లే తాను బెంగాల్ జట్టు తరఫున ఆడాల్సి వచ్చిందని తెలిపాడు. నాణ్యమైన ప్రదర్శన ఇచ్చినా రెండేళ్ల పాటు జట్టులోకి తీసుకోకుండా పక్కన పెట్టేశారని తెలిపాడు. ‘నా సెలెక్షన్ గురించి మా అన్నయ్య చీఫ్ సెలెక్టర్‌ను కలిశాడు. కానీ అతను మాత్రం తాను ఈ పదవిలో ఉన్నంత వరకు సెలెక్ట్ చేయనని చెప్పాడు’ అని పేర్కొన్నాడు.