ప్రపంచకప్ 2023 అనంతరం టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీవీఎస్ లక్ష్మణ్ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే రాహుల్ ద్రవిడ్‌ను మరికొన్ని రోజులు కోచ్‌గా కొనసాగాలని బీసీసీఐ కోరింది. దీనికి ద్రవిడ్ కన్ఫర్మేషన్ ఇవ్వనట్లు సమాచారం. ఒకవేళ అతడు ఓకే చెబితే డిసెంబర్ 10 నుంచి దక్షిణాఫ్రికాలో పర్యటించే భారత జట్టుకు కోచ్‌గా వ్యవహరించనున్నారు.