భారత్లో జరిగిన వన్డే ప్రపంచకప్ ద్వారా భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) ఆదాయం మరింత పెరిగింది. ప్రస్తుతం బీసీసీఐ నెట్వర్త్ రికార్డు స్థాయిలో ఏకంగా 2.25 బిలియన్ డాలర్లుగా ఉంది. అంటే మన కరెన్సీలో అక్షరాల రూ.18,760 కోట్లుగా ఉంది. ఇతర క్రికెట్ బోర్డుల ఆదాయం బీసీసీఐతో పోలిస్తే 10 శాతం కూడా లేకపోవడం గమనార్హం. ఇక రెండో స్థానంలో ఆస్ట్రేలియా(రూ.658 కోట్లు), మూడో స్థానంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (రూ.490 కోట్లు) ఉన్నాయి.