భారత స్టార్ రెజ్లర్, ఒలింపిక్ పతక విజేత బజ్రంగ్ పునియా కీలక నిర్ణయం తీసుకున్నాడు. కేంద్ర ప్రభుత్వం అందించిన పద్మశ్రీ అవార్డుని వెనక్కి ఇస్తున్నట్లు వెల్లడించాడు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్‌భూషణ్‌కు విధేయుడైన సంజయ్ సింగ్ డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిగా ఎన్నికవడాన్ని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నాడు. శుక్రవారం పార్లమెంట్ వద్ద ప్రధానికి లేఖ రాసి, దానిపై పద్మశ్రీ అవార్డును పెట్టి వెళ్లిపోయాడు.