టీం ఇండియా సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ ఇటీవల జరిగిన వరల్డ్ కప్ లో చూపించిన ప్రదర్శన ఎన్నటికీ మరువలేనిది. క్రికెట్ చరిత్రలో షమీ ఇన్నింగ్స్ నిలిచిపోతుంది. ప్రస్తుతం ఎడమ మడమ గాయలకు చికిత్స పొందుతున్న షమీ దక్షణాఫ్రికాతో జరుగనున్న రెండో టెస్టుకు దూరమయ్యారు. వాస్తవానికి వరల్డ్ కప్ సిరీస్ లోనూ షమీ నొప్పులు భరిస్తూ మ్యాచ్ లు ఆడారు. ఆ సమయంలో రెగ్యులర్ గా ఇంజెక్షన్లు తీసుకుంటూ బౌలింగ్ చేశారు.