బంగ్లాదేశ్తో జరిగిన రెండో టీ20లో న్యూజిలాండ్ డీఎల్ఎస్ పద్ధతిలో విజయం సాధించింది. మౌంట్ మంగ్నూయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో.. 17 రన్స్ తేడాతో కివీస్ బంగ్లాను ఓడించి సిరీస్ను సమం చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 110 పరుగులకే కుప్పకూలింది. ఇక లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన కివీస్ 14.4 ఓవర్లలో 95/5 పరుగుల వద్ద ఉండగా వర్షం పడింది. దీంతో డీఎల్ఎస్ ప్రకారం కివీస్ గెలిచినట్లు అంపైర్లు ప్రకటించారు.