సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఇటీవల 10, 12 తరగతుల అకడమిక్ ఫ్రేమ్ వర్క్‌లో గణనీయమైన మార్పులను ప్రతిపాదించింది. సీబీఎస్ఈ 10వ తరగతిలో ప్రస్తుతం విద్యార్థులు రెండు లాంగ్వేజెస్‌ను చదువుతున్నారు.
ఇకపై వారు 10వ తరగతిలో మూడు భాషలను నేర్చుకోవాలని, అందులో కనీసం రెండు భారతీయ భాషలు అయి ఉండాలని సీబీఎస్ఈ ప్రతిపాదిస్తోంది. అలాగే 12వ తరగతి వారు ఇకపై రెండు లాంగ్వేజెస్ నేర్చుకోవాలని సీబీఎస్ఈ ప్రతిపాదిస్తోంది.