ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి తగినంత శారీరక శ్రమ అవసరం. అందుకే ప్రతి రోజు వాకింగ్ చేయడం ఎంతో మంచిదని వైద్యులు చెబుతుంటారు. అయితే వాకింగ్ ఎప్పుడు చేయాలనేది చాలా మందికి తెలియదు.
ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య నడకకు ఉత్తమ సమయంగా ఓ అధ్యయనంలో వెల్లడైంది. కొన్ని కారణాలతో ఉదయం నడవలేకపోతే సాయంత్రం కూడా వాకింగ్‌కు వెళ్లొచ్చు. ఇక ప్రతిరోజూ 30 నుంచి 45 నిమిషాల నడక ద్వారా మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.