2024 ఐపీఎల్ లో భాగంగా నిన్న మొదటి మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్ మరియూ కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో కోల్‌కతా ఏకంగా 98 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది. టాస్ గెలిచిన లక్నో మొదట బౌలింగు ఎంచుకోగా కోల్‌కతా మొదట బాటింగ్ కి దిగింది. ఫిల్ సాల్ట్ 14 బంతుల్లో 1 సిక్సర్, 5 ఫోర్ల సాయంతో 32 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. మరో ఓపెనర్ సునీల్ నరైన్ 39 బంతుల్లో 7 సిక్సర్లు, 6 ఫోర్ల సాయంతో 81 పరుగులు చేసి బలమైన ఇన్నింగ్స్ ఆడాడు. తర్వాత వచ్చిన రఘువంశీ (32), ఆండ్రీ రసెల్ (12), రింకూ సింగ్ (16), కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (23), రమణ్ దీప్ సింగ్ (25) ఇలా ఫటాఫట్ ఆడారు. మొత్తానికి 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేశారు. "లక్నో బౌలింగులో నవీన్ ఉల్ హక్ 3, యష్ ఠాగూర్ 1. రవి బిష్ణోయ్ 1, యుథ్వీర్ సింగ్ 1 వికెట్స్ తీసుకున్నారు.
236 పరుగుల చేసింగ్ కి దిగిన లక్నో మొదట్లోనే వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ అర్షిణ్ కులకర్ణి (9) చేసి ఔట్ అయ్యాడు. మరో ఓపెనర్ కెప్టెన్ కేఎల్ రాహుల్ (25) తనూ త్వరగా ఔట్ అయిపోయాడు. ఫస్ట్ డౌన్ వచ్చిన మార్కస్ స్టొయినిస్ (36) పరుగులకే వెనుతిరిగారు. దీపక్ హుడా (5), నికోలస్ పూరన్ (10), ఆయుష్ బదొని (15), టర్నర్ (16) అయిపోవడంతో తర్వాత వచ్చిన వాళ్లు సింగిల్ డిజిట్ కే ఔట్ అయిపోయారు. ఇలా మొత్తానికి 16.1 ఓవర్లలో 137కి ఆలౌట్ అయిపోయింది."కోల్ కతా బౌలింగులో హర్షిత్ రాణా 3, వరుణ్ 3, మిచెల్ స్టార్క్ 1, సునీల్ నరైన్ 1, అండ్రీ రసెల్ 2 వికెట్లు తీసుకున్నారు.