2024 ఐపీఎల్ లో భాగంగా నిన్న సన్ రైజర్స్ హైదరాబాద్ vs లక్నో సూప్ జెయింట్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హ్యదరాబాద్ ఘన విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ ఓపెనర్స్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ విధ్వంసంతో రికార్డులు నెలకొల్పారు. లక్నో మొదట టాస్ గెలిచి బాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ డికాక్ (2) , మార్కస్ స్టోనిస్ (3) వెంటవెంటనే ఔట్ అయిపోయారు. కెప్టెన్ కేఎల్ రాహుల్ (29) ఒంటరి పోరాటం చేశాడు. కానీ లాంగ్ ఆన్ లో దొరికిపోయాడు. మరోవైపు కృనాల్ పాండ్యా (24) కాసేపు నిలబడ్డాడు. అనంతరం నికోలస్ పూరన్ 26 బంతుల్లో 48 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అలాగే ఆయుష్ బధోని 30 బంతుల్లో 55 చేసి నాటౌట్ గా నిలిచాడు. మొత్తానికి లక్నో 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. "హైదరాబాద్ బౌలింగులో భువనేశ్వర్ 2, కమిన్స్ 1 వికెట్ పడగొట్టారు.
166 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన హైదరాబాద్ సన్ రైజర్స్ ఓపెనర్స్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. కేవలం 9.4 ఓవర్లలో 166 పరుగుల లక్షాన్ని ఛేదించి రికార్డు బద్దలుకొట్టారు. ఓపెనర్ అభిషేక్ శర్మ 28 బంతుల్లో 6 సిక్స్ లు, 8 ఫోర్ల సాయంతో 75 పరుగులు చేశాడు. మరో విధ్వంసకర ఓపెనర్ ట్రావిస్ హెడ్ అయితే 30 బంతుల్లో 8 సిక్స్ లు, 8 ఫోర్ల సాయంతో 89 పరుగులు చేశాడు. ఇద్దరూ నాటౌట్ గా నిలిచారు. "లక్నో బౌలింగులో యష్ ఠాగూర్ 2.4 ఓవర్లలో 47 పరుగులు, రవి బిష్ణోయ్ 2 ఓవర్లలో 34 పరుగులు, నవీన్ 2 ఓవర్లలో 37 పరుగులు సమర్పించుకున్నారు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు.