2024 ఐపీఎల్ లో భాగంగా నిన్న గుజరాత్ టైటాన్స్ తో కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడాల్సి వుంది. కానీ మ్యాచ్ రద్దవడంతో ఐపీఎల్ 2024 ప్లేఆప్ రేసు నుంచి ఔట్ అయింది. భారీ వర్షం కురుస్తుండటంతో మ్యాచ్ కొనసాగే అవకాశం లేకపోవడం టాస్ ఆలస్యం అయింది. అయితే, వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్ రద్దు అయింది. మరోవైపు ప్లేఆఫ్స్ లో చోటుదక్కించుకున్న కోల్ కతా నైట్ రైడర్స్ ప్రత్తుం 19 పాయింట్ల తో ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో టాప్ లో ఉంది. మరోవైపు గుజరాత్ జట్టుకు ఇది డూ ఆర్ డై మ్యాచ్ అయినప్పటికీ వర్షం వారి ఆశలపై నీళ్లు చల్లింది. ఇప్పుడు గుజరాత్ జట్టు 13 మ్యాచ్‌ల్లో 11 పాయింట్లతో ఉంది. ఫైనల్ మ్యాచ్‌లో గెలిచినా 13 పాయింట్లకే చేరుకోగలదు. కాబట్టి జీటీ ప్లే ఆఫ్ రేసు నుంచి ఔట్ అయింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌లో టాస్ కూడా జరగకపోవడంతో చివర్లో ఇద్దరు కెప్టెన్లు నిరాశను వ్యక్తం చేశారు.