నిరుద్యోగులకు భారత టెలికమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. వివిధ విభాగాల్లో ఆఫీసర్ పోస్టులకు తాజాగా రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.డిపార్ట్‌మెంట్‌లోని అసిస్టెంట్ డైరెక్టర్ (AD), జూనియర్ టెలికాం ఆఫీసర్ (JTO) పోస్టుల భర్తీకి తాజాగా రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ప్రారంభమైంది. అర్హత ఉన్నవారు సెప్టెంబర్ 5 లోపు అప్లై చేసుకోవచ్చు. ఈ లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు చూద్దాం.
* పోస్టులు, ఖాళీలుఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో మొత్తం 3 పోస్టులు భర్తీ కానున్నాయి. అసిస్టెంట్ డైరెక్టర్ (AD)- 2 ఉద్యోగాలు, జూనియర్ టెలికాం ఆఫీసర్ (JTO)- 1 పోస్టు ఖాళీగా ఉంది.
* అర్హత ప్రమాణాలు
మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ విభాగంలో అసిస్టెంట్ డైరెక్టర్ (AD), జూనియర్ టెలికాం ఆఫీసర్ (JTO) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌లో ఇచ్చిన సంబంధిత అర్హతలు కలిగి ఉండాలి. ప్రభుత్వ రంగ సంస్థలు లేదా పరిశోధనా సంస్థల నుండి పదవీ విరమణ చేసిన అధికారులు లేదా BSNL/MTNL వంటి ప్రభుత్వ సంస్థల్లో పనిచేసి పదవీ విరమణ పొందిన అధికారులు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
అభ్యర్థులు తప్పనిసరిగా CDA స్కేల్ లేదా IDA స్కేల్ 7వ CPC సబ్‌స్టాంటివ్ గ్రేడ్ ఉద్యోగంలో పదవీ విరమణ చేసి ఉండాలి. ఎంపికైన అభ్యర్థుల ఉద్యోగ ఒప్పందం 6 నెలల పాటు ఉంటుంది. డీఓటీ అవసరాల మేరకు కాంట్రాక్ట్‌ను ఆ తర్వాత 36 నెలలకు పొడిగించవచ్చు.
* వయో పరిమితి
అసిస్టెంట్ డైరెక్టర్, జూనియర్ టెలికాం ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 64 ఏళ్లు మించకూడదు.
* జీత భత్యాలు
ఎంపికైన అభ్యర్థులకు DoT నిబంధనల ప్రకారం నిర్ణీత మొత్తంలో రెమ్యునరేషన్ చెల్లిస్తారు. ఇతర అలవెన్సులు లేదా ఇంక్రిమెంట్లు ఉండవు.
* అప్లికేషన్ ప్రాసెస్
అర్హత ఉన్నవారు అధికారిక వెబ్‌సైట్ నుంచి అప్లికేషన్ ఫారమ్ డౌన్‌లోడ్ చేసి నింపాలి. అవసరమైన డాక్యుమెంట్స్‌తో ఫారమ్‌ను 'ఎడిషనల్ డైరెక్టర్ జనరల్ (టెలికాం), UP(ఈస్ట్) LSA; డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్; 1వ అంతస్తు, CTO కాంపౌండ్, M.G.మార్గ్, హజరత్‌గంజ్, లక్నో-226001' అడ్రస్‌కు సెప్టెంబర్ 5 లోపు చేరుకునేలా పంపించాలి.
* సెలక్షన్ ప్రాసెస్
సంబంధిత అధికారులు దరఖాస్తులను పరిశీలించి అర్హులైన అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. సెలక్షన్ ప్యానెల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. అభర్థుల ఎంపికపై ఈ ప్యానెల్ తుది నిర్ణయం తీసుకుంటుంది. ఎంపికైన కన్సల్టెంట్లు అవుట్‌డోర్ విధులు నిర్వహించాల్సి ఉంటుంది. అవుట్‌డోర్ విధుల నిర్వహణపై ఆసక్తి ఉన్న వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని టెలికమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొంది.