మాసాల్లోకెల్లా ఉత్తమైన మాసం కార్తీక మాసం. ఆధ్యాత్మికంగా దివ్యమైన కార్తీక మాసంలో చేసే స్నానానికి విశిష్టమైన స్థానం ఉంది. సర్వ మంగళకర మాసమైన కార్తీక మాసంలో శివ కేశవులను పుజిస్తారు.ఇది దామోదర మాసం కనుక ‘కార్తిక దామోదర’ అనే నామంతో స్మరణ చేస్తారు.సూర్యోదయానికి ముందే బ్రహ్మ మూహుర్తంలో అభ్యంగన స్నానమాచరిస్తారు. ఈ నెలలో వెలిగించే దీపం శుభకరం అని నమ్మకం. అయితే కార్తీక మాసం రేపటి నుంచి అంటే నవంబరు 02వ తేదీ శనివారం నుంచి ప్రారంభం అవుతుంది. ఈ కార్తీక మాసం విశేషాలు, పండగల గురించి తెలుసుకుందాం..
నవంబరు 02 వ తేదీ శనివారం నుంచి కార్తీక మాసం ప్రారంభం
నవంబరు 03వ తేదీ ఆదివారం యమ విదియ- భగినీహస్త భోజనం అంటే అన్నాచెల్లెళ్ల పండగ
నవంబర్ 04 వ తేదీ మొదటి కార్తీక సోమవారం..
నవంబరు 05 వ తేదీ మంగళవారం – నాగుల చవితి
నవంబర్ 11 వ తేదీ రెండవ కార్తీక సోమవారం
నవంబరు 12 వ తేదీ మంగళవారం దేవుత్తని ఏకాదశి
నవంబరు 13 వ తేదీ బుధవారం క్షీరాబ్ది ద్వాదశి
నవంబరు 15వ తేదీ శుక్రవారం కార్తీక పౌర్ణమి
నవంబర్ 18 వ తేదీ కార్తీకమాసం మూడో సోమవారం
నవంబర్ 25 వ తేదీ కార్తీకమాసం నాలుగో సోమవారం
నవంబర్ 26 వ తేదీ కార్తీక బహుళ ఏకాదశి
నవంబర్ 29 వ తేదీ కార్తీక మాసం మాస శివరాత్రి
డిసెంబర్ 1 వ తేదీ ఆదివారం కార్తీక అమావాస్య
డిసెంబర్ 2 వ తేదీ సోమవారం మార్గశిర శుధ్ధ పాడ్యమి పోలి స్వర్గం
ఈ ఏడాది కార్తీక మాసం నవంబరు 02వ తేదీ శనివారం నుంచి ప్రారంభమవుతుంది. డిసెంబరు 02వ తేదీ సోమవారం పోలిస్వర్గంతో కార్తీక మాసం పూర్తవుతుంది.