ముంబైలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు వార్తల్లోకి ఎక్కింది. ఓ హోటల్లో వ్యక్తి, ఓ బాలికతో శృంగారంలో పాల్గొన్న అనంతరం మరణించాడు. సదరు వ్యక్తిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.ఇదీ జరిగింది..ముంబైలోని గ్రాంట్ రోడ్ ప్రాంతంలో శనివారం ఈ ఘటన జరిగింది. ఓ హోటల్లో మైనర్‌తో శృంగారంలో పాల్గొన్న 41 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. 14 ఏళ్ల బాలిక తల్లి ఫిర్యాదు మేరకు అతనిపై భారతీయ న్యాయ సంహిత, లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద అత్యాచారం, ఇతర నేరాలకు సంబంధించిన కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.మృతుడు గుజరాత్‌లోని ఓ వజ్రాల కంపెనీలో మేనేజర్. గుజరాత్ నుంచి బాలికను తన వెంట తెచ్చుకున్నాడు. బాలికతో శృంగారం చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. హోటల్ సిబ్బంది అతన్ని ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతను కొద్దిసేపటి తర్వాత మరణించాడు.
"ఆ వ్యక్తికి గుండెపోటు వచ్చినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది" అని అధికారులు తెలిపారు.
బాలికకు జరిగిన ఘటన ఆమె తల్లికి తెలిసింది. సమాచారం అందుకున్న మైనర్ తల్లి ముంబైకి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తప్పుడు హామీతో ఆ వ్యక్తి తన బిడ్డను ముంబైకి రప్పించాడని ఆమె తెలిపింది.
ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని డీబీ మార్గ్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు.
నర్సుపై అత్యాచారం..
దేశంలో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా మహిళలు, బాిలికలపై అత్యాచారం కేసులు ఆందోళనకర రీతిలో పెరుగుతున్నాయి. 2ఏళ్ల నర్సుపై ఓ ప్రైవేట్ ఆస్పత్రి డైరెక్టర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన యూపీలో చోటుచేసుకుంది.
అత్యాచారానికి ముందు నర్సుకు మత్తు పదార్థాలతో కూడిన శీతల పానీయం ఇచ్చి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
బాధితురాలు గత రెండు నెలలుగా కల్యాన్పూర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోందని ఆ ప్రాంత అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) అభిషేక్ పాండే తెలిపారు.ఆదివారం సాయంత్రం ఆస్పత్రిలో డైరెక్టర్ ఇచ్చిన విందుకు ఆమె హాజరయ్యారు. అధికారిక పనుల నెపంతో రాత్రి వేళల్లో ఆసుపత్రిలో ఉండాలని నిందితుడు కోరాడని, అర్ధరాత్రి సమయంలో ఆమెను తన గదికి పిలిపించి బలవంతంగా లోపలికి లాక్కెళ్లి తలుపుకు తాళం వేశాడని ఏసీపీ తెలిపారు. డైరెక్టర్ నర్సును బందీగా తీసుకుని ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని పేరు చెప్పడానికి ఇష్టపడని మరో అధికారి తెలిపారు.
ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని నర్సును నిందితుడు బెదిరించాడు. అరెస్టు అనంతరం అతడిని కోర్టులో హాజరుపర్చామని తెలిపారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం నమోదు చేసేందుకు కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు వెల్లడించారు.