ఈనెల 9వ తేదీ నాటికి నీటి యాజమాన్య సంఘాల ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ మందిరంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ త్వరలో జరగనున్న నీటి సంఘాల ఎన్నికల నాటికి ఎటువంటి పెండింగ్ పనులు లేకుండా ముందస్తు చర్యలలో భాగంగా ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలన్నారు.