సినీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మకి బిగ్ షాక్ తగలనుంది. నోటీసులు ఇచ్చేందుకు ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు హైదరాబాద్ వెళ్లారు. జూబ్లీహిల్స్ లోని రాంగోపాల్ వర్మ ఇంటికి వెళ్లి ఆయనకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలవనున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లను కించపరిచే విధంగా రాంగోపాల్ వర్మ పోస్టులు పెట్టాడని మద్దిపాడు స్టేషన్లో కేసు నమోదు అయింది. మార్ఫింగ్ చేసిన ఫోటోలు ఎక్స్ లో పోస్టు చేశాడని టీడీపీ మండల కార్యదర్శి రామలింగం మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో ఆర్జీవీపై ఫిర్యాదు చేశారు. రామలింగం ఫిర్యాదు మేరకు మూడు రోజులు క్రితం కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా, ఆయనకు నోటిసులు ఇచ్చేందుకు వెళ్లారు.