బాపట్ల మండలం సూర్యలంక పర్యాటక కేంద్రాన్ని బుధవారం ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ అధికారులతో కలిసి పర్యటించారు. కార్తీక మాసం పురస్కరించుకొని భక్తులకు, యాత్రికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేపట్టిన పనులను ఆయన పరిశీలించారు. 24 గంటలు మెరైన్ సిబ్బంది, పోలీసులు, సీసీ కెమెరాలతో అప్రమత్తంగా ఉండాలని ఆయన అధికారులను సూచించారు. మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డితో పాటు పోలీసు అధికారులు పాల్గొన్నారు.