మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని అకోలాలో గుజరాత్‌కు చెందిన ఓ నిందితుడిని క్రైమ్ బ్రాంచ్ ఆదివారం అరెస్టు చేసింది. ఈ హత్య కేసులో ఇప్పటివరకు 25 మంది నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాకు చెందిన సల్మాన్ భాయ్ ఇక్బాల్ భాయ్ వోహ్రాను స్థానిక పోలీసుల సహాయంతో అకోలాలోని బాలాపూర్‌లో అరెస్టు చేశారు.