చౌడేపల్లి మండలంలోని బోయకొండ గంగమ్మ ఆలయ ఛైర్మన్ పదవి దళితులకు ఇవ్వాలని బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు నరసింహులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సోమవారం పుంగనూరు పట్టణంలో దళిత నాయకులు సమావేశం నిర్వహించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా దళితుల కులస్తులకు, నామినేటెడ్ పోస్టులలో నియమించాలని బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు అయూబ్ ఖాన్ కోరారు.