పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు బ్రిటిష్ పార్లమెంట్ లండన్ వేదికగా ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ హానర్ ఇంగ్లాండ్ 2024 విజినరీ అవార్డును సోమవారం ప్రకటించింది. లండన్ పార్లమెంట్ వేదికగా త్వరలో అతిరథ మహారాజుల సమక్షంలో పురస్కారాన్ని అందజేస్తున్నట్లు వారు ప్రకటించారు. సాంబశివరావు సేవ దృక్పథాన్ని గుర్తించి అవార్డు అందజేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.