ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్ఆర్జీఈఏస్‌ నిధుల్ని దారి మళ్లించారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 22, 2024, 12:32 PM

 ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజుతో ముగియనున్నాయి. ఉదయం 9 గంటలకు శాసన సభ ప్రారంభంమైంది. ఉదయం 10 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో ఈరోజు పీఏసీ కమిటీకి ఎన్నిక కానుంది. వైసీపీ నుంచి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ వేయడంతో ఓటింగ్ కు ఏర్పాట్లు చేశారు. ఒక్కో సభ్యుని ఎన్నికకు 20 మంది ఎమ్మెల్యేలు సంఖ్యా బలం అవసరం. అయితే ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఎన్‌ఆర్ఈజీ‌ఎస్ పై సభ్యులు అడిగిన ప్రశ్నకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమాధానం ఇచ్చారు. ఎన్ఆర్ఈజీఎస్ అనేది డిమాండ్ ఆధారిత పథకమని తెలిపారు.నైపుణ్యం లేని మ్యానువల్ పనిని చేయడానికి వయోజనులకు 100 రోజలు పనిని కల్పిస్తున్నామని తెలిపారు.


కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో ఈ పనులు చేపడుతున్నామని అన్నారు. ఎన్ఆర్ఈజీఎస్‌లో కొత్తగా పనికోసం నమోదు చేసుకున్న వారికి జాబ్ కార్డులు 15 రోజుల్లోగా ఇవ్వడం జరుగుతుందని వివరించారు. అయిదు కిలోమీటర్లలోపు పనిని కలిపిస్తున్నామని అన్నారు. అసెంబ్లీలో సభ్యులు చెప్పిన విషయాలను నోట్ చేసుకున్నామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. రూ. 5400 కోట్ల రూపాయలు వేజ్, మెటీరియల్ కాంపౌండ్‌తో నిధులు వచ్చాయన్నారు. జగన్ ప్రభుత్వం రూ.13వేల కోట్లు దారి మళ్లించిందని. ఈ అంశంపై లోతైన విచారణ చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. జాబ్ కార్డుల్లో అవకతవకలపై చర్యలు తప్పని సరిగా తీసుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com