ప్రాజెక్టు గేట్ల నిపుణుడు ఎన్. కన్నయ్య నాయుడును జల వనరుల శాఖ (మెకానికల్) సలహాదారుగా నియమిస్తూ గురువారం ఆశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ ఉత్తర్వు జారీ చేశారు. కన్నయ్య నాయుడు ఈ బాధ్యతల్లో రెండేళ్లపాటు ఉంటారు. నెలకు లక్షన్నర గౌరవ వేతనం చెల్లిస్తారు. విజయవాడలో ఉండగా రోజుకు రూ.1,000 కన్వేయన్స్ అలవెన్స్ చెల్లిస్తారు. విమానం, ఏసీ ఫస్ట్ క్లాస్ చార్జీలను చెల్లిస్తారు.