ఉత్సాహంగా పారా క్రీడాకారుల అథ్లెటిక్ పోటీలు జరిగాయి. దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం అనంతపురం స్థానిక నీలం సంజీవరెడ్డి పీటీసీ మైదానంలో జిల్లా క్రీడాభివృద్ధి శాఖ అధికారి ఉదయ్‌భాస్కర్ ఆధ్వర్యంలో పారా క్రీ డాకారులకు క్రీడాపోటీలు నిర్వహించారు. షాట్‌పుట్, డిస్కస్ త్రో, 100, 200మీటర్ల రన పోటీలు సాగాయి. మొత్తం నూరు మందికి పైగా పారా క్రీడాకారులు పాల్గొన్నారు.
విజేతలకు మంగళవారం డీఎస్‌ఏ అశోక్‌నగర్ ఇండోర్‌స్టేడియంలో నిర్వహించే అంతర్జాతీయ విభిన్నప్రతిభావంతుల దినోత్సవం రోజున బహుమతులు ప్రదానం చేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా పారా స్పోర్ట్స్ అసోసియేషన అధ్యక్ష, కార్యదర్శులు నాగరాజు, శ్రీనివాసులు, శాప్ కోచలు మంజుళ, జెబీవుల్లా, అనీల్‌కుమార్, నరేష్‌కుమార్, వంశీ, సంధ్య, సుబ్రమణ్యం, లక్ష్మి, అంజనకుమార్, చలపతి, పారా క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.