ఘంటసాల గ్రామానికి చెందిన వేమూరి వెంకట్రామయ్య - నరసమ్మల కుమారుడు రామారావు జ్ఞాపకార్దం వారి సోదరి వేమూరి వెంకట రమణమ్మ భారీ విరాళం బుధవారం అందించారు.
ఘంటసాలలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం, శ్రీ జలదీశ్వర స్వామి దేవస్థానంలకు ఉత్సవాలకు, భక్తులకు ప్రసాదాలు అందజేసే నిమిత్తం గాను రూ. 2 లక్షల విరాళంను ట్రస్ట్రీలు గొర్రెపాటి వెంకట రామకృష్ణ, జగన్ మోహన్ రావులకు దాత తరపున గొర్రెపాటి గోపాలకృష్ణ అందించారు.