విభజన అంశాలపై రెండు తెలుగు రాష్ట్రాల సీఎస్ల సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల విభజన అంశాలపై ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు శాంతికుమారి, నీరబ్ కుమార్ ప్రసాద్ మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో సోమవారం సమావేశం అయ్యారు. రాష్ట్ర పునర్వవస్థీకరణ చట్టంలోని అంశాలపై ఏపీలో తొలిసారిగా సీఎస్‌లు భేటీ అయ్యారు. అధికారుల కమిటీ సమావేశానికి ప్రాధాన్యం సంతరించకుంది. ఏపీ - తెలంగాణా సీఎస్ల నేతృత్వంలో అధికారుల కమిటీ సమావేశం జరిగింది. విభజన చట్టంలోని 9.10 షెడ్యూలు సంస్థల ఆస్తుల పంపకాలపై సీఎస్ల కమిటీ చర్చించారు. విద్యుత్ బకాయిలు, ఉద్యోగుల పరస్పర మార్పిడి, వృత్తి పన్ను పంపకంపై అధికారుల కమిటీ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.