క్రిస్టమస్ పండగ నేపథ్యంలో ఫ్రీ గిఫ్ట్స్ అంటూ సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడనున్నట్లు పోలీసులు హెచ్చరిస్తున్నారు. మీ కోసం కిస్టమస్ గిఫ్ట్.. అంటూ వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే సందేశాలను పట్టించుకోవద్దని సూచిస్తున్నారు. అత్యాశతో లింక్‌పై క్లిక్ చేస్తే.. ఫోన్‌లో మాల్వేర్ ఇన్‌స్టాల్ అయి వ్యక్తిగత డేటా చోరీ చేస్తారని చెబుతున్నారు. కావున, క్రిస్టమస్ శుభాకాంక్షల పేరిట వచ్చే లింక్స్ క్లిక్ చేసి.. డబ్బులు పోగొట్టుకోవద్దని చెబుతున్నారు.