సాగు నీటి సంఘాల ఎన్నికలకు రంగం సిద్ధమైం ది ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడగా, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా ఏర్పాట్లను పూర్తిచేసింది. బుధవారం కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. డిస్ర్టిబ్యూటర్ కమిటీల వారీగా ఎన్నికలను ఇప్పటికే నియమించిన అధికారులు ప్రకటిస్తారు. 14న నీటి వినియోగదారుల సంఘాలకు, 17న డీసీలు(డిస్ట్రిబ్యూటరీ కమిటీలు) ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల తరువాత షెడ్యూ ల్ ప్రకారం ప్రాజెక్టు కమిటీ ఎన్నికలు జరగాలి. ప్రభుత్వం తేదీలను ప్రకటించలేదు. రెండు, మూడు రోజుల్లో ఆ కమి టీ ఎన్నికల తేదీలను ప్రకటించవచ్చునని ఇరిగేషన్ అధికారులు భావిస్తున్నారు.
జిల్లాలో మొత్తం 114 నీటి సంఘాలు ఉన్నాయి. వీటి ఎన్నికలు సక్రమంగా జరిగేం దుకు ప్రతి సంఘానికి ఒక అధికారిని నియమించింది. ఇందులో వ్యవసాయ, మండల పరిషత్, రెవెన్యూ, ఇతర శాఖల ఆధికారులు ఉన్నారు. 14 డిస్ర్టిబ్యూటర్ కమిటీల ఎన్నికల నిర్వహణకు 14 మంది జిల్లా అధికారుల్ని నియమించారు. బుధవారం కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేయగానే ముందుగా మండలాల వారీగా డిస్ర్టిబ్యూటర్ కమిటీ ఎన్నికలను ప్రకటిస్తారు. 14న ఎన్నికలు సక్రమం గా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అదే రోజున టీసీ సభ్యులు సమావేశమై అధ్యక్షులు, ఉపాధ్యక్షు లతోపాటు ఆరుగురు డైరెక్టర్లను ఎన్నుకుంటారు. ఇలా అధ్యక్షులుగా ఎన్నికైన వారు ఈ నెల 17న డీసీలను ఎన్నుకుంటారు. డిస్ర్టిబ్యూటర్ కమిటీలో కూడా ఒక అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఉంటారు. ఇలా ఎన్నికైన డీసీలు ప్రాజెక్టు కమిటీని ఎన్నుకుంటుంది. ఈ కమిటీలో ఆరుగురు సభ్యులు ఉంటారు. వారిలో ఒకరిని జిల్లా ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌గా, మరొకరిని ఉపాధ్యక్షులుగా ఎన్నుకుంటారు. మిగిలిన నలుగురు డైరెక్టర్లుగా ఉంటారు.