రైతును రాజు చేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఆ మాటలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల ప్రశ్నించారు. ఇచ్చిన మాట ప్రకారం.. రైతులను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదుకోవాల్సిందే అన్నారు. రైతులకు అండగా వైయస్ఆర్సీపీ ఇవాళ రైతు పోరుబాట అన్ని జిల్లాల్లో నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా శ్యామల మాట్లాడుతూ .. రోడ్డెక్కిన అన్నదాతలకు వైయస్ఆర్సీపీ బాసటగా నిలుస్తుందని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఆరు నెలలు పూర్తి చేసుకున్నా కూడా.. రైతులకు పెట్టుబడి సాయం అందించలేదని మండిపడ్డారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు గడుస్తోంది. రైతుల సంక్షేమం గాలికి వదిలేసింది. పెట్టుబడి సాయం ఊసే ఎత్తడం లేదు. పైగా వరి ధాన్యం కొనుగోలు చేయకుండా ఆలస్యం చేస్తోంది. అకాల వర్షాలకు వరి ధాన్యం భారీగా తడిసింది. తడిసిన ధాన్యాన్ని రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వం కచ్చితంగా కొనుగోలు చేయాలని ఆమె డిమాండు చేశారు.